Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఐపీఎల్ 2027 వేలానికి ముహూర్తం ఖరారు.. ఈసారి గోవాలో!

IPL 2027 Auction Date Finalized This Time In Goa
Advertisement
  • ఐపీఎల్ 2027 వేలానికి తేదీ, వేదిక ఖరారు
  • డిసెంబర్ 16న గోవాలో జరగనున్న ఆక్షన్
  • మూడేళ్ల విరామం తర్వాత భారత్‌లో ఐపీఎల్ వేలం
  • ఫ్రాంచైజీల కోరిక మేరకే స్వదేశంలో నిర్వహణ
  • ఆటగాళ్ల జాబితా, పర్స్ వివరాలు త్వరలో వెల్లడి
Advertisement
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) అభిమానులకు బీసీసీఐ కీలక అప్‌డేట్ ఇచ్చింది. ఐపీఎల్ 2027 సీజన్‌కు సంబంధించిన వేలం తేదీని, వేదికను బోర్డు ఖరారు చేసినట్లు తెలుస్తోంది. ఈ ఏడాది వేలం ప్రక్రియ డిసెంబర్ 16న గోవా వేదికగా జరగనుంది. ఈ మేరకు మొత్తం 10 ఐపీఎల్ ఫ్రాంచైజీలకు భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) నుంచి శనివారం సమాచారం అందినట్లు తెలుస్తోంది.

గోవాలోని ఐటీసీ గ్రాండ్ హోటల్ ఈ వేలానికి ఆతిథ్యం ఇవ్వనుంది. వేలానికి ఒక రోజు ముందు, అంటే డిసెంబర్ 15న ఫ్రాంచైజీల ప్రతినిధుల కోసం ప్రత్యేకంగా బ్రీఫింగ్ సెషన్ నిర్వహించనున్నారు. బీసీసీఐ లాజిస్టిక్స్ బృందం ఇప్పటికే వాట్సాప్ సందేశం ద్వారా ఫ్రాంచైజీలకు ప్రాథమిక సమాచారం అందించగా, దీనిపై అధికారికంగా ఈ-మెయిల్ ద్వారా ధ్రువీకరణ రావాల్సి ఉంది.

గత మూడు సీజన్లుగా ఐపీఎల్ వేలం విదేశీ గడ్డపైనే నిర్వహించారు. 2024 సీజన్ కు దుబాయ్, 2025 సీజన్ కు జెడ్డా, 2026 సీజన్ కు అబుదాబి నగరాలు ఈ వేలానికి ఆతిథ్యమిచ్చాయి. ఈ క్రమంలో మూడేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఐపీఎల్ వేలం తిరిగి భారత్‌లో జరగనుండటం ప్రాధాన్యత సంతరించుకుంది. ఫ్రాంచైజీల నుంచి వచ్చిన విజ్ఞప్తులను పరిగణనలోకి తీసుకున్న బోర్డు, ఈసారి స్వదేశంలోనే వేలం నిర్వహించాలని నిర్ణయించింది. ఈ ఏడాది సెప్టెంబర్‌లోనే బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా, ఐపీఎల్ ఛైర్మన్ అరుణ్ ధుమాల్ వంటి అధికారులు డిసెంబర్ మధ్యలో గోవాలో వేలం జరపవచ్చని సంకేతాలిచ్చారు.
Advertisement
Advertisement
IPL 2027 Auction
BCCI
Goa
Indian Premier League
Cricket Auction 2027
ITC Grand Goa

More Telugu News